Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki - విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ పూర్తి

Vishwak Sen'd Das Ka Dhamki - దాస్ కా ధమ్కీ అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది.

Das Ka Dhamki - విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ పూర్తి
X

విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. విశ్వక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌ సినిమా ఇది. స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత కూడా అతడే కావడం విశేషం. చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇప్పటివరకూ విడుదలైన 'దాస్ కా ధమ్కీ' ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలైన 2 పాటలూ పెద్ద హిట్టవ్వడం సినిమాకు ప్లస్ అయింది. ఇక ట్రయిలర్ అయితే అప్పట్లో పెద్ద ట్రెండ్ అయింది.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు (విశ్వక్ తండ్రి) నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.

First Published:  26 Feb 2023 3:31 PM GMT
Next Story