Mechanic Rocky | డబ్బింగ్ స్టార్ట్ చేసిన విశ్వక్
Vishwak Sen - మెకానిక్ రాకీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సినిమా దీపావళికి వస్తోంది.
BY Telugu Global19 Aug 2024 4:17 AM GMT
X
Telugu Global Updated On: 19 Aug 2024 4:17 AM GMT
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు దర్శకుడు రవితేజ ముళ్లపూడి. ఈ సినిమా కథ రాసుకున్నది కూడా ఇతడే.
ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను లావిష్ గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగల్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మనోజ్ కటసాని సినిమాటోగ్రాఫర్. మెకానిక్ రాకీ విడుదల తేదీని ఇదివరకే ప్రకటించారు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Next Story