Telugu Global
Cinema & Entertainment

Gaami | గామి కోసం విశ్వక్ సేన్ కష్టం ఇది

Gaami Movie - నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది గామి సినిమా. ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని బయటపెట్టాడు విశ్వక్ సేన్.

Gaami | గామి కోసం విశ్వక్ సేన్ కష్టం ఇది
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'గామి'. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి-సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ సందర్భంగా సినిమా కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు విశ్వక్.

"వారణాసిలో ‘గామి’ షూటింగ్ చేస్తున్నపుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడిని. దర్శకుడు విద్యాధర్ ,గామి కోసం చాలా రీసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసు. దాదాపు నాలుగున్నరెళ్ళు పాటు చేశాం. ఇంత సమయం ఇచ్చాము కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే అవేమీ గుర్తు లేవు. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోర అనుకోని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలకూర్చున్నప్పుడు ఓ మూసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’

ఇలా గామి కోసం తను పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు విశ్వక్ సేన్. క్రౌడ్ ఫండింగ్ చేసి మరీ 2018లో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా.. నరేష్ కుమారన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు సింగిల్ టేక్ లో 8 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశాడు విశ్వక్.

First Published:  7 Feb 2024 4:56 PM GMT
Next Story