Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | మరో సినిమా వదులుకున్న విశ్వక్ సేన్

Vishwak Sen - సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మరో పెద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

Vishwak Sen | మరో సినిమా వదులుకున్న విశ్వక్ సేన్
X

హీరో విశ్వక్ సేన్ మరో సినిమా వదులుకున్నాడు. ఈసారి ఏకంగా చాలా పెద్ద సినిమా అని సమాచారం. ఈ విషయాన్ని అతడే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తను ఎంతగానో అభిమానించే ఓ పెద్ద హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందట విశ్వక్ సేన్ కి. పారితోషికం కూడా బాగానే ఆఫర్ చేశారట.

అయితే ఆ సినిమాలో తన పాత్రపై పూర్తిస్థాయిలో విశ్వక్ సేన్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. అందుకే తన అభిమాన హీరో నటించిన సినిమా అయినప్పటికీ, తిరస్కరించినట్టు వెల్లడించాడు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పోషించిన పాత్ర ఎలా ఉంటుందో, దాదాపు ఆ స్థాయిలో తనకు కీలక పాత్ర ఆఫర్ చేశారని.. కానీ సదరు పెద్ద హీరోతో అంతకంటే మంచి సినిమా చేయాలనేది తన ఉద్దేశమని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.


బాలకృష్ణ-దర్శకుడు బాబి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీలోనే కీలక పాత్ర కోసం విశ్వక్ ను సంప్రదించారని, అతడు తిరస్కరించాడనే టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని మాత్రం విశ్వక్ సేన్ వెల్లడించలేదు. విశ్వక్ కు బాలకృష్ణ అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ హీరో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అతడు నటించిన గామి సినిమా విడుదలకు సిద్ధమైంది. అటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వీటితో పాటు మరో 2 సినిమాల షూటింగ్స్ తో అతడు బిజీగా ఉన్నాడు.

First Published:  17 Feb 2024 12:47 PM GMT
Next Story