Telugu Global
Cinema & Entertainment

Gaami | మా సినిమాలో రాకెట్ సైన్స్ లేదు

Vishwak Sen - నిన్నటికినిన్న గామి వివాదంపై స్పందించిన విశ్వక్ సేన్, తాజాగా ఆ సినిమాపై వచ్చిన మరికొన్ని విమర్శలపై రియాక్ట్ అయ్యాడు.

Gaami | మా సినిమాలో రాకెట్ సైన్స్ లేదు
X

గామి సినిమాపై వస్తున్న విమర్శలపై దశలవారీగా స్పందిస్తున్నాడు హీరో విశ్వక్ సేన్. మొన్నటికిమొన్న బుక్ మై షో రేటింగ్స్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాడు. ఇప్పుడు సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు.

గామి సినిమా కన్ఫ్యూజింగ్ గా ఉందని కొందరు చేసిన కామెంట్స్ తన దృష్టికి వచ్చాయంటున్నాడు విశ్వక్ సేన్. తమ సినిమాలో రాకెట్ సైన్స్ లేదని, కొంచెం ఏకాగ్రతతో మనసు పెట్టి చూస్తే సినిమా అర్థమౌతుందని అంటున్నాడు. చాలామందికి సినిమా అర్థమైంది కాబట్టి, కొంతమందికి అర్థం కాలేదనే విమర్శలో లాజిక్ లేదని కొట్టిపారేశాడు.

గామి సినిమా అర్థంకాని వాళ్లను మూగ-చెవిటి వాళ్లుగా అనలేమని, అలాంటి వాళ్లు సినిమాను మరొక్కసారి థియేటర్లలో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలకు కూడా పిలుపునిచ్చాడు. తమ సినిమాను టాలీవుడ్ పెద్దలు చూసి రియాక్ట్ అవ్వాలని కోరాడు.

గామి సినిమా ప్రభంజనం ఇప్పుడే మొదలైందంటున్నాడు విశ్వక్. తమ సినిమా 20 ఏళ్ల తర్వాత క్లాసిక్ అవుతుందని చెబుతున్నాడు. ఇప్పటికైనా సినిమాపై విమర్శలు, బాట్స్ లాంటివి ఆపేయాలని, థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు.

First Published:  13 March 2024 5:02 PM GMT
Next Story