Telugu Global
Cinema & Entertainment

Gaami | గామి లుక్ కోసం చాలా కష్టపడ్డాను

Vishwak Sen - గామి సినిమా కోసం చాలా కష్టపడ్డానంటున్నాడు హీరో విశ్వక్ సేన్. ఐదేళ్ల పాటు ఈ సినిమాను నిర్మించారు.

Gaami | గామి లుక్ కోసం చాలా కష్టపడ్డాను
X

విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నాడు. గామి లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడట ఈ హీరో.

"లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. షూటింగ్ కు 15 రోజులకు ముందే మెల్లగా ఆ లుక్ లోకి రావడానికి ప్రిపేర్ అయ్యేవాడిని. అఘోర పాత్ర కోసం దర్శకుడు కావాల్సిన రిసెర్చ్ ఇచ్చారు. కుంభమేళాలో అయితే కొన్ని లక్షల మంది అఘోరాలు ఉంటారు. వారిలో కలసిపోయి తిరిగేవాడ్ని. నా స్టయిల్ లో ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోరా అనుకోని చాలా మంది దానాలు చేశారు."

ఈ సినిమా కోసం చాలా సవాళ్లు ఎదుర్కొంది యూనిట్. మైనస్ 30 డిగ్రీల చలిలో షూట్ చేశారు. కాళ్ళు చేతులు గడ్డలు కట్టేసినా షూటింగ్ కొనసాగించారు. ఇలా ఎంతో రిస్క్ చేసి గామి సినిమా షూటింగ్ పూర్తిచేశారు.

First Published:  3 March 2024 7:05 AM GMT
Next Story