Telugu Global
Cinema & Entertainment

Matti Kusthi: రెండో రోజు రెండో లుక్

Matti Kusthi Movie Updates: ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఊరుకోలేదు. వరుసగా రెండో రోజు సెకెండ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న మట్టి కుస్తీ సినిమాకు సంబంధించి సెకెండ్ లుక్ కూడా వచ్చేసింది.

Matti Kusthi: రెండో రోజు రెండో లుక్
X

ఒక సినిమా నుంచి రెండు లుక్స్ రిలీజ్ చేయడం కొత్తేంకాదు. అప్పుడెప్పుడే బంగార్రాజు సినిమా కోసం నాగార్జున ఈ సంప్రదాయాన్ని ప్రారంభిస్తే, ఆ తర్వాత చాలామంది హీరోలు దాన్ని కొనసాగించారు. ఫస్ట్ లుక్ తో పాటే రెండో లుక్ కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. మట్టీకుస్తీ యూనిట్ కూడా ఇదే సంప్రదాయాన్ని ఫాలో అయింది.

విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఈ సినిమా నుంచి సెకెండ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ను రవితేజ విడుదల చేయగా, రెండో లుక్ ను నేరుగా సోషల్ మీడియాలోకి వదిలారు.

మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ లో హీరో విష్ణు విశాల్ ను రెజ్లర్ గా చూపించారు. బరిలో దిగిన రెజ్లర్ గా ఎగ్రెసివ్ గా కనిపించాడు విష్ణు విశాల్. ఇక సెకండ్ లుక్ లో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో దిగిన ట్రెడిషనల్ ఫొటోను రిలీజ్ చేశారు.

అలా ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్ తో పాటు ఫ్యామిలీ-లవ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రవితేజ నిర్మిస్తున్న ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

First Published:  4 Nov 2022 6:30 AM GMT
Next Story