Telugu Global
Cinema & Entertainment

మార్క్ ఆంటోనీ.. విశాల్ నుంచి మరో సినిమా

విశాల్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. ఈ యాక్షన్ మూవీకి మార్క్ ఆంటోనీ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

మార్క్ ఆంటోనీ.. విశాల్ నుంచి మరో సినిమా
X

యాక్షన్ హీరో విశాల్ సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న సినిమా "మార్క్ ఆంటోనీ". విశాల్ కు కెరీర్ లో ఇది 33వ సినిమా. మినీ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

"మార్క్ ఆంటోనీ" ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎగ్రెసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు విశాల్. ఈ హీరో గత సినిమాల్లానే ఇది కూడా యాక్షన్ మూవీ అనే విషయం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది. కాకపోతే ఈసారి విశాల్ కొత్త మేకోవర్ ట్రై చేశాడు. జుట్టు, గడ్డం పూర్తిగా మారిపోయింది.

మార్క్ ఆంటోనీలో అభినయ, మహేంద్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఎస్ జే సూర్య, ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అన్ని భాషల ప్రజలకు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కుతోందని, అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని అంటున్నాడు విశాల్.




First Published:  29 Aug 2022 10:55 AM GMT
Next Story