Telugu Global
Cinema & Entertainment

విశాల్ లాఠీ మూవీ.. యాక్షన్ టీజర్

విశాల్ నుంచి లాఠీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా టీజర్ రిలీజైంది.. ఎలా ఉందో చూద్దాం

విశాల్ లాఠీ మూవీ.. యాక్షన్ టీజర్
X

విశాల్ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ'. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ విడుదలైంది.

నిమిషం 38సెకన్ల నిడివి గల లాఠీ 'టీజర్' ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉంది. వంటినిండా గాయాలు, చేతికి కట్లు వున్న విశాల్.. చుట్టుముట్టిన రౌడీ మూకలని చూస్తూ.. "రేయ్... తప్పు చేసి తలదాచుకునే పోకిరివి... నీకే ఇంత పొగరున్నప్పుడు... ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని... నాకు ఎంత పొగరుంటుంది" అని వార్నింగ్ ఇవ్వడం పోలీస్ పవర్ ని చూపించింది.

ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న భవనంలో వచ్చిన భారీ యాక్షన్ బ్లాక్ బాగుంది. బిల్డింగ్ లో వరుసగా లైట్లు వెలగడం, గుంపులుగా రౌడీలు రావడం, విశాల్ రౌడీ మూకలపై యుద్ధాన్ని ప్రకటించడం బాగా తీశారు. దర్శకుడు వినోద్ కుమార్ విశాల్ క్యారెక్టర్‌ని మాస్‌గా ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశాడు.

టెక్నికల్ గా టీజర్ రిచ్ గా ఉంది. పీటర్ హెయిన్ డిజైన్ చేసిన స్టంట్స్ టీజర్ లో హైలెట్. టీజర్ కి సామ్ సిఎస్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా సెకెండాఫ్ లో వచ్చే 45 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు.

సెప్టెంబర్ 15న 'లాఠీ' అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.



First Published:  25 July 2022 3:16 AM GMT
Next Story