Telugu Global
Cinema & Entertainment

Laatti Trailer: లాఠీ పట్టిన విశాల్ విశ్వరూపం

Vishal's Laatti Movie: విశాల్ నుంచి ఈసారి పాన్ ఇండియా మూవీ రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలవుతుంది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

Laatti Trailer: లాఠీ పట్టిన విశాల్ విశ్వరూపం
X

యాక్షన్ హీరో విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ'. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా థియేట్రికల్ ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రయిలర్ ప్రారంభమైంది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యాడు. ''మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్'' అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే తన కర్తవ్యం.. అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది.

సినిమాలో సునైనా విశాల్ భార్యగా నటించింది. ట్రైలర్ లో రొమాంటిక్ పార్ట్ కూడా చూపించారు. వీరికి 10 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ట్రైలర్ సినిమాలోని అన్ని అంశాలను చూపించింది. అయితే యాక్షన్ పార్ట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో భారీ స్టంట్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.

సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే అని చెబుతోంది యూనిట్. విశాల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించగా.. సునైనా కూల్‌ క్యారెక్టర్ లో కనిపించింది. బాలసుబ్రమణియన్ వండర్ ఫుల్ ఫ్రేమ్‌లు, యువన్ శంకర్ రాజా అద్భుతమైన బిజియం ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.



First Published:  14 Dec 2022 4:08 AM GMT
Next Story