Telugu Global
Cinema & Entertainment

Actor Vishal: ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న విశాల్ మార్కెట్ ఇప్పుడు భారీగా పడిపోయిందిగా

Actor Vishal: కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు ఉన్న విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. చాలా వరకు తమిళ్ లో విశాల్ సూపర్ హిట్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధించాయి.

Vishal
X

విశాల్

కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు ఉన్న విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. చాలా వరకు తమిళ్ లో విశాల్ సూపర్ హిట్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధించాయి. టాలీవుడ్ లో కూడా విశాల్ మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. కానీ గత కొంతకాలంగా విశాల్ తెలుగు మార్కెట్ బాగా దెబ్బతిన్నది అని చెప్పుకోవచ్చు.

వరుసగా విశాల్ నటిస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. కొద్దికాలం బ్రేక్ తీసుకున్న తర్వాత విశాల్ మళ్లీ "లాఠీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లో విడుదలైంది. కానీ ఈ సినిమా కూడా విశాల్ కు అనుకున్న స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయిందని చెప్పుకోవాలి.

గతంలో కంటెంట్ తో సంబంధం లేకుండా విశాల్ సినిమాలు అదిరిపోయే కలెక్షన్లను నమోదు చేసుకుంటూ ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కంటెంట్ బావుంటే తప్ప డబ్బులు పెట్టి మరి థియేటర్లకు వచ్చి సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ "లాఠీ" సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి

ఇక సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుతుందా లేదా అని కూడా చెప్పటం కష్టతరంగా మారింది. విశాల్ తెలుగు మార్కెట్ విపరీతంగా తగ్గిపోయిందని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా విశాల్ మళ్లీ తన తెలుగు మార్కెట్ ని పెంచుకుంటే బాగుంటుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి నెక్స్ట్ సినిమాతో విశాల్ మెప్పిస్తారో లేదో వేచి చూడాలి.

First Published:  25 Dec 2022 11:29 AM GMT
Next Story