Telugu Global
Cinema & Entertainment

Vishal | నా సినిమాలన్నీ ఒకెత్తు, ఈ ఒక్క సినిమా మరో ఎత్తు

Vishal Mark Antony - మార్ ఆంటోనీ సినిమా తన కెరీర్ లో నెక్ట్స్ లెవెల్ అంటున్నాడు హీరో విశాల్. సినిమా గురించి ఇంకా ఏం చెప్పాడంటే..?

Vishal | నా సినిమాలన్నీ ఒకెత్తు, ఈ ఒక్క సినిమా మరో ఎత్తు
X

గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం విశాల్ ప్రత్యేకత. ఏడాదికి కనీసం 2 సినిమాలైనా విశాల్ నుంచి వస్తుంటాయి. అయితే ఎక్కువగా యాక్షన్ సబ్జెక్టులే ఎంచుకుంటాడు ఈ హీరో. ఈసారి కూడా యాక్షన్ మూవీనే సెలక్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఇది ఎంతో విభిన్నమైన సినిమా.

విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా మార్క్ ఆంటోనీ. ఇదొక పీరియాడిక్ యాక్షన్ మూవీ. తన కెరీర్ లో సినిమాలన్నీ ఒకెత్తయితే, మార్క్ ఆంటోనీ సినిమా మరో ఎత్తు అంటున్నాడు విశాల్. కెరీర్ లో ఇప్పటవరకు ఈ టైపు సినిమా చేయలేదంట ఈ హీరో.

"'మార్క్ ఆంటోని నా కెరీర్లో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో 2 విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్య నటించారు. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ లాంటి ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు."

పేరుకి పీరియాడిక్ మూవీ అయినప్పటికీ, ప్రేక్షకులు తన నుంచి కోరుకునే అన్ని యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ మార్క్ ఆంటోనీలో ఉంటాయంటున్నాడు విశాల్. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  29 Aug 2023 5:12 PM GMT
Next Story