Telugu Global
Cinema & Entertainment

Virupaksha | మరోసారి చేతులు కలిపిన విరూపాక్ష టీమ్

Virupaksha - విరూపాక్ష యూనిట్ మరోసారి కలిసింది. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్, సుకుమార్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.

Virupaksha | మరోసారి చేతులు కలిపిన విరూపాక్ష టీమ్
X

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టీమ్‌ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమాపై ప్రేక్ష‌కుల్లో, సినీ ప‌రిశ్ర‌మ‌లో, ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి అంచ‌నాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి అంచ‌నాల‌తో ఓ కాంబినేష‌న్ రిపీట్ కాబోతుంది.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త‌మీన‌న్ జంట‌గా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర సంస్థ‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌ల సంయుక్త నిర్మాణంలో బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన మిస్టీక్ థ్రిల్ల‌ర్ విరూపాక్ష చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజయం సాధించిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కంటెంట్‌తో పాటు హైటెక్నికల్ వాల్యూస్ ప‌రంగా కూడా ప్ర‌శంస‌లు అందుకుంది ఈ చిత్రం.

“విరూపాక్ష‌”ను మిస్టీక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందించిన కార్తీక్ దండు తాజాగా త‌న త‌దుప‌రి చిత్రాన్ని మైథిక‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందించ‌బోతున్నాడు. ఈ చిత్రాన్నికూడా “విరూపాక్ష”చిత్రాన్ని నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఈసారి కూడా సుకుమార్ తో కలిసి పనిచేయబోతున్నాడు.

తాజాగా ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశారు. ఆసక్తి రేకెత్తించేలా ఉంది పోస్టర్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ు ఆల్రెడీ మొదలయ్యాయి. మ‌రిన్ని వివ‌రాల‌ు త్వ‌ర‌లోనే వెల్లడిస్తారు.

First Published:  15 Aug 2023 3:26 AM GMT
Next Story