Telugu Global
Cinema & Entertainment

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష

Virupaksha OTT News: థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన విరూపాక్ష సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మరోసారి థ్రిల్ అందించబోతోంది.

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష
X

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష

రీసెంట్ గా థియేటర్లలో సూపర్ హిట్టయిన విరూపాక్ష సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అలా సాయితేజ్ కెరీర్ లోనే తొలి వంద కోట్ల సినిమాగా రికార్డ్ సృష్టించిన విరూపాక్ష, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కోసం సిద్ధమైంది.

రాత్రి నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది విరూపాక్ష సినిమా. ఈ జానర్ సినిమాలు ఓటీటీ లో కూడా బాగా నడుస్తాయి. నెట్ ఫ్లిక్స్ నమ్మకం కూడా అదే. అందుకే సినిమాకు భారీగా ప్రచారం చేసింది. ప్రత్యేకంగా ట్రయిలర్ కూడా కట్ చేసి రిలీజ్ చేసింది.

ఈ సినిమాతో తెలుగులో తమ సబ్ స్క్రిప్షన్ బేస్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది నెట్ ఫ్లిక్స్. అంతర్జాతీయ స్థాయిలో నంబర్-2లో కొనసాగుతున్న నెట్ ఫ్లిక్స్, ఈమధ్యే తెలుగు మార్కెట్ పై దృష్టిలో పెట్టింది. ఇందులో భాగంగా బడా తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.

తెలుగులో అమెజాన్, ఆహా నుంచి నెట్ ఫ్లిక్స్ కు గట్టిపోటీ ఉంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో సోనీ లివ్ నుంచి ఈ కంపెనీకి పోటీ ఉంది. తాజా అంచనాల ప్రకారం.. తెలుగులో మరో రెండేళ్లలో తాము టాప్ ప్లేయర్ గా ఎదుగుతామని చెబుతోంది నెట్ ఫ్లిక్స్.



First Published:  21 May 2023 5:10 AM GMT
Next Story