Telugu Global
Cinema & Entertainment

Virupaksha - ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ విరూపాక్ష

Virupaksha OTT - థియేటర్లలో సూపర్ హిట్టయిన విరూపాక్ష సినిమా, ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించడానికి సిద్ధమైంది. స్ట్రీమింగ్ కు డేట్ లాక్ అయింది.

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష
X

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విరూపాక్ష. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ సక్సెస్ అయింది. విడుదలై నాలుగో వారంలోకి ప్రవేశించిన ఈ మూవీ, వంద కోట్ల రూపాయల వసూళ్లు దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

విరూపాక్ష సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సినిమా సూపర్ హిట్టవ్వడంతో, ఆ సంస్థ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడీ సినిమాను 21వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టనుంది. ఈ మేరకు అధికారిక ప్రచారం కూడా ప్రారంభించింది.

ఫ్లాప్ అయిన సినిమాల్ని ఇప్పుడు ఓటీటీలు కూడా పట్టించుకోవడం లేదు. సైలెంట్ గా స్ట్రీమింగ్ కు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న శాకుంతలం సినిమా ఎలా ఓటీటీకి వచ్చిందో అందరం చూశాం. అదే హిట్టయిన సినిమాను మాత్రం ఓటీటీలో గట్టిగా భుజాన వేసుకుంటున్నాయి. కొంత బడ్జెట్ కేటాయించి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు విరూపాక్ష విషయంలో నెట్ ఫ్లిక్స్ అదే చేయబోతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా ప్రత్యేకంగా మరో ట్రయిలర్ లాంఛ్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్. ఆ తర్వాత సినిమాను గ్రాండ్ గా స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది.

First Published:  16 May 2023 12:29 PM GMT
Next Story