Telugu Global
Cinema & Entertainment

Virupaksha - కాంతారతో సంబంధం లేదంటున్న సాయితేజ్

Virupaksha - కాంతార సినిమాతో విరూపాక్షకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు సాయిధరమ్ తేజ్. తమ సినిమాలో ప్రతి 15 నిమిషాలకు థ్రిల్ ఉంటుందని చెబుతున్నాడు.

Virupaksha - కాంతారతో సంబంధం లేదంటున్న సాయితేజ్
X

మిస్టిక్ థ్రిల్లర్ గా వస్తోంది విరూపాక్ష సినిమా. అటు కాంతార సినిమాలో కూడా దాదాపు ఇవే ఛాయలు కనిపిస్తాయి. పైగా కాంతారకు మ్యూజిక్ అందించిన అజనీష్, విరూపాక్షకు కూడా సంగీతం అందించాడు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేలా ఉంటాయనే టాక్ బయటకొచ్చింది. దీనిపై సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

"ఈ సినిమాను కాంతారాతో పోల్చను. అది కల్ట్ క్లాసిక్ సినిమా. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇండియానా జోన్స్ సినిమాలు నాకు చాలా ఇష్టం. విక్రాంత్ రోణ సినిమాను చూసి అజనీష్ గారిని తీసుకున్నాం. ఇందులో పాటలకు ఎక్కువ స్కోప్ ఉండదు. షెర్లాక్ హోమ్స్ టైపులో ఉంటుంది. ప్రతీ 15 నిమిషాలకు ఏదో ఒక కొత్త కారెక్టర్ వస్తుంది.. పాటలతో బోర్ కొట్టించాలని మేం అనుకోలేదు."

ఇలా కాంతారాకు విరూపాక్షకు సంబంధం లేదని ప్రకటించాడు సాయితేజ్. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది విరూపాక్ష సినిమా.

First Published:  19 April 2023 3:14 PM GMT
Next Story