Telugu Global
Cinema & Entertainment

Virupaksha Enters 100 cr Club: వంద కోట్ల క్లబ్ లో చేరిన విరూపాక్ష

Virupaksha Enters 100 cr Club: సాయితేజ్ రికార్డ్ సృష్టించాడు. విరూపాక్ష సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష
X

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష

Virupaksha Enters 100 cr Club | ఎంతో ఉత్కంఠ మధ్య, ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ రికార్డ్ సృష్టించాడు. అతడు నటించిన విరూపాక్ష సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తాజా వసూళ్లతో కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో వంద కోట్ల క్లబ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్.

సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, తన తొలి సినిమానే వంద కోట్లు సాధించాడు. దీంతో సాయితేజ్ పై ఒత్తిడి పెరిగింది. రీసెంట్ గా వచ్చిన సినిమాలతో ఈ ఘనత సాధించలేకపోయాడు. విరూపాక్షతో ఆ వంద కోట్ల టాక్ వచ్చింది.

అయితే టాక్ అయితే వచ్చింది కానీ, వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా చేరదా అనే టెన్షన్ మాత్రం అందరికీ ఉండేది. ఎందుకంటే, ఈ వీకెండ్ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. విరూపాక్ష ఓటీటీలోకి వస్తే, ఇక థియేట్రికల్ రన్ క్లోజ్ అయినట్టే.

కానీ అనూహ్యంగా విరూపాక్ష సినిమా వంద కోట్ల క్లబ్ లోకి వెళ్లింది. గత వారం రిలీజైన కస్టడీ సినిమా ఫ్లాప్ అవ్వడం, విరూపాక్షకు మరింత కలిసొచ్చింది. మొత్తానికి సాయితేజ్ కూడా వందకోట్ల హీరో అయిపోయాడు.

First Published:  18 May 2023 3:56 PM GMT
Next Story