Telugu Global
Cinema & Entertainment

వినరో భాగ్యము విష్ణుకథ.. టీజర్ ఎలా ఉందంటే!

చకచకా సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం మరో మూవీ రెడీ చేశాడు. వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజైంది.

వినరో భాగ్యము విష్ణుకథ.. టీజర్ ఎలా ఉందంటే!
X

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు. ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురళి కిషోర్ గ‌తంలో పని చేశాడు.

ఈరోజు హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'వినరో భాగ్యము విష్ణుకథ' టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ అందరినీ అలరించింది. తాజాగా వచ్చిన టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది.

నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి..

మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా.. అని కిరణ్ చెప్తుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ టీజర్ ముగుస్తుంది. ఇందులో కిరణ్, తిరుపతి కుర్రాడిలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నారు.



First Published:  15 July 2022 2:50 AM GMT
Next Story