Telugu Global
Cinema & Entertainment

Vimanam movie - మరో మంచి పాత్రలో సముత్తరఖని

Vimanam movie teaser released - సముద్రఖని లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా విమానం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. స్టోరీలైన్ కూడా లైట్ గా టచ్ చేశారు

Vimanam movie - మరో మంచి పాత్రలో సముత్తరఖని
X

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుందీ సినిమా. వైవిధ్య‌మైన పరిస్థితులు, వాటికి సూట్ అయ్యే సున్నిత‌మైన పాత్ర‌ల‌ను ఈ చిత్రంలో మ‌నం చూడొచ్చు.

విమానం సినిమాలో స‌ముద్రఖని అంగవైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించాడు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

విమానం ప్రోమో తాజాగా రిలీజైంది. ప్రోమోను గ‌మ‌నిస్తే.. అందులో తండ్రీకొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి త‌న తండ్రి స‌ముద్ర ఖ‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని తండ్రి అడిగితే, పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా చ‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు. తండ్రీకొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను సున్నితంగా, చ‌క్క‌గా ప్రోమోలో ఎలివేట్ చేశాడు రైట‌ర్ కమ్ డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్.

జీ స్టుడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు ఇందులో మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతుంది.



First Published:  15 April 2023 11:04 AM GMT
Next Story