Telugu Global
Cinema & Entertainment

Thangalaan | విక్రమ్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Thangalaan Movie - సంక్రాంతికి వస్తుందనుకున్న తంగలాన్ సినిమా వాయిదా పడింది. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Thangalaan | విక్రమ్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా "తంగలాన్". ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.

పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "తంగలాన్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన "తంగలాన్" సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తారు.

నిజానికి ఈ సినిమాను పొంగల్ కు విడుదల చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఆ టైమ్ లో తమిళనాట, తెలుగులో భారీ పోటీ ఉంది. అందుకే తంగలాన్ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించి, రిపబ్లిక్ డే కు షెడ్యూల్ చేశారు.

First Published:  27 Oct 2023 5:47 PM GMT
Next Story