Telugu Global
Cinema & Entertainment

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?

Dhruva Nakshatram Movie Trailer Review in Telugu విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ధృవనక్షత్రం. ఈ సినిమా ట్రయిలర్ ను తాజాగా విడుదల చేశారు.

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "ధృవ నక్షత్రం". రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించాడు. అంతేకాదు, ఈ సినిమాకు నిర్మాత కూడా ఇతడే. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై సినిమాను నిర్మించాడు.

రెండు భాగాలుగా తెరపైకి రానుంది ధృవ నక్షత్రం. ఇందులో మొదటి భాగానికి ధృవ నక్షత్రం - ఛాప్టర్ 1 - యుద్ధకాండం అనే పేరు పెట్టారు. ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం" ట్రైలర్ సినిమా థీమ్ ను పరిచయం చేసింది. ముంబై పై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు.

క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఓ కీ-రోల్ పోషించాడు. ట్రయిలర్ కు హరీశ్ జైరాజ్ అందించించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

First Published:  10 Nov 2023 5:10 PM GMT
Next Story