Telugu Global
Cinema & Entertainment

విక్రమ్ 'కోబ్రా' ట్రయిలర్ రివ్యూ

విలక్షణ నటుడు విక్రమ్ తాజా చిత్రం కోబ్రా. ఈ సినిమా తెలుగు ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ నిండా విక్రమ్ గెటప్పులే..

విక్రమ్ కోబ్రా ట్రయిలర్ రివ్యూ
X

విక్రమ్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'కోబ్రా' థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

''హి ఈజ్ ఏ కోబ్రా. రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్ళడం తెలుసు. చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు.'' అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్.. హైవోల్టేజ్ యాక్షన్, విక్రమ్ రకరకాల అవతారాలు, నట విశ్వరూపంతో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. తన జీవితంలోని ప్రతి ఒక్క సెకను అంకెలను పీల్చుకుంటూ, ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొని, దేశ విదేశాలు తిరుగుతూ, గణితశాస్త్రాన్ని ఉపయోగించి నేరాలకు పాల్పడే మేధావి కోబ్రా పాత్రలో విక్రమ్ నటన బ్రిలియంట్ గా ఉంది.

ఈ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతుచిక్కని కోబ్రా కోసం వేటలో ఉన్న పోలీసుగా కనిపించాడు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రేయసిగా కనిపించగా, రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు. ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 31న రిలీజ్ అవుతోంది కోబ్రా మూవీ.



First Published:  27 Aug 2022 1:44 PM GMT
Next Story