Telugu Global
Cinema & Entertainment

కోబ్రా వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్

కోబ్రా మూవీతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు విక్రమ్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

కోబ్రా వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్
X

విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా, వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'కోబ్రా' చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే తెలుగులో ప్రచారం ప్రారంభించబోతున్నాడు విక్రమ్.

First Published:  9 Aug 2022 4:22 PM GMT
Next Story