Telugu Global
Cinema & Entertainment

Thangalaan Movie: మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్

Thangalaan Movie: మరో ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు విక్రమ్. దీపావళి సందర్భంగా ఆ సినిమా టైటిల్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ కడపలో జరుగుతోంది.

Thangalaan Movie: మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్
X

కోలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది. ఇంకో కల్ట్ సినిమా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విలక్షణ నటుడు విక్రమ్, విభిన్న చిత్రాల దర్శకుడు పా.రంజిత్ మరోసారి కలిశారు.

చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రానికి తంగలాన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆయనకిది 61వ సినిమా. పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

వెలుగుల పండుగ దీపావళి పర్వదినం సందర్భంగా తంగలాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చియాన్ విక్రమ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆయన గతంలో ఎన్నడూ చేయని పాత్ర ఇది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ప్రారంభించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.



First Published:  24 Oct 2022 11:30 AM GMT
Next Story