Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ చేస్తా

సూర్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 24. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు.

ఆ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ చేస్తా
X

కొన్ని కథలు కొందరికి తెగ నచ్చేస్తాయి. వీలైతే వాటిని కొనసాగించాలని వాళ్లు భావిస్తారు. సూర్య నటించిన 24 అనే సినిమా కూడా ఇలాటిందే. ఈ స్టోరీ అంటే దర్శకుడు విక్రమ్ కుమార్ కు చాలా ఇష్టం. అందుకే వీలైతే 24 సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు ఈ దర్శకుడు.

ప్రతి రోజూ ఈ కథ విక్రమ్ కుమార్ మైండ్ లో నడుస్తూనే ఉంటుందట. ఈ సీక్వెల్ కు సంబంధించి ఓ 4 పేజీల డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడట. కాకపోతే పూర్తిస్థాయి స్క్రీన్ ప్లేగా మలచడానికి టైమ్ కుదరడం లేదంటున్నాడు ఈ దర్శకుడు.

ఈ కథ, సినిమా సూర్యకు కూడా బాగా ఇష్టం. దీనికి కారణం ఇందులో ఆయన పోషించిన ఆత్రేయ పాత్ర. ఈ క్యారెక్టర్ సూర్యకే కాదు, ఆయన ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చింది. సీక్వెల్ లో ఈ పాత్రను ఎలా ఆవిష్కరించాలనే అంశంపై విక్రమ్ కుమార్ ఇంకా ఎలాంటి క్లారిటీకి రాలేదు. అందుకే ఈ సీక్వెల్ ప్రాజెక్టు, డ్రాఫ్ట్ దశలోనే ఆగిపోయింది.

24 సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు సూర్య. యంగ్ హీరో పాత్రలో, అతడి తండ్రి సైంటిస్ట్ పాత్రలో, ఇక విలన్ గా కూడా సూర్యానే నటించాడు. ఈ పాత్రల్ని తిరిగి ఎలా కొనసాగించాలనే అంశంపై విక్రమ్ కుమార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.


First Published:  18 July 2022 7:23 AM GMT
Next Story