Telugu Global
Cinema & Entertainment

Varisu movie collections: విజయ్ సినిమాకు అతి తక్కువ వసూళ్లు

Varisu movie Box Office collections: అజిత్ సినిమా దెబ్బతో విజయ్ మూవీకి వసూళ్లు తగ్గిపోయాయి. మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోలేకపోయింది వారిసు సినిమా.

Varisu movie collections: విజయ్ సినిమాకు అతి తక్కువ వసూళ్లు
X

గట్టి పోటీ మధ్య తమిళనాడ రిలీజైంది విజయ్ హీరోగా నటించిన వారిసు (వారసుడు) సినిమా. అజిత్ నటించిన తునివు (తెగింపు) కూడా అదే రోజు రిలీజ్ అవ్వడంతో విజయ్ సినిమా వసూళ్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా వారిసు సినిమాకు వసూళ్లు వచ్చాయి

నిన్న రిలీజైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. 2017 తర్వాత విజయ్ నటించిన ఓ సినిమాకు మొదటి రోజు ఇలా 50 కోట్ల లోపు గ్రాస్ రావడం ఇదే తొలిసారి.

విజయ్ నటించిన బీస్ట్ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 87 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అదే మాస్టర్ సినిమాకు 54 కోట్లు, సర్కార్ సినిమాకు 71 కోట్లు, బిగిల్ కు 67 కోట్లు, మెర్సెల్ కు 51 కోట్లు.. ఇలా ప్రతి సినిమాకు 50 దాటి గ్రాస్ వచ్చింది. వారిసు మాత్రం ఆ మార్క్ అందుకోలేకపోయింది.

తమిళనాట విజయ్, అజిత్ ఇద్దరూ పెద్ద స్టార్లు. ఇలాంటి పెద్ద స్టార్లు నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల విజయ్ వారిసుకు ఈ పరిస్థితి వచ్చింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. అయితే కోలీవుడ్ వసూళ్లతో అతడికి సంబంధం లేదు. ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వారిసు సినిమాను అవుట్-రేట్ కు ఇచ్చేశారు దిల్ రాజు.

First Published:  12 Jan 2023 11:00 AM GMT
Next Story