Telugu Global
Cinema & Entertainment

Thalapathy Vijay: వారసుడు ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Thalapathy Vijay's Varasudu Movie: విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా వారసుడు. తమిళ్ లో ఈ సినిమాకు వారిసు అనే పేరు పెట్టారు. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు

Thalapathy Vijay: వారసుడు ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?
X

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వారసుడు'. తమిళ్ లో దీనికి వారిసు అనే పేరు పెట్టారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రచారం షురూ చేశారు. ఇందులో భాగంగా లిరికల్ వీడియోస్ విడుదల చేస్తున్నారు.

వారసుడు సినిమా నుంచి రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న తమన్ ఈ పాట కోసం మంచి ట్యూన్ కంపోజ్ చేశాడు. మానసితో కలిసి విజయ్ స్వయంగా ఈ పాట పాడాడు. విజయ్ వాయిస్ ఈ పాటకు ఆకర్షణగా నిలిచింది.

విజయ్‌, జానీ మాస్టర్‌ల కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేస్తే సూపర్ హిట్ ఖాయం. ఇక ఈ పాటలో రష్మిక స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్‌లు కలర్ ఫుల్ గా ఉన్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో ఉన్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు.



Next Story