Telugu Global
Cinema & Entertainment

Vaarasudu: వారసుడు థియేట్రికల్ ట్రయిలర్ ఎలా ఉందంటే?

Vaarasudu Movie: వారసుడు మూవీ ట్రయిలర్ రిలీజైంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చెక్ చేద్దాం..

Vaarasudu: వారసుడు థియేట్రికల్ ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన సినిమా వారసుడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.

'వారసుడు' థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ''ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా'' అని జయసుధ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ .. ఆద్యంతం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పండగ మూవీ అనిపించుకుంది వారసుడు.

విజయ్ ఎంట్రీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. విజయ్ యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్స్ ఎక్స్ టార్డినరీగా ఉన్నాయి. విజయ్- రష్మిక ల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. సూపర్ హిట్టయిన రంజితమే పాటకు కూడా ట్రయిలర్ లో చోటిచ్చారు.

విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ, బ్రదర్స్ గా శ్రీకాంత్, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ లో శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పాత్ర రూపంలో విజయ్ కుటుంబానికి ఒక పెద్ద సవాల్ ఎదురౌతుంది. ఆ సవాల్ ని ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేది చాలా క్యూరియాసిటీగా చూపించారు.

ట్రైలర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.



First Published:  5 Jan 2023 7:30 AM GMT
Next Story