Telugu Global
Cinema & Entertainment

Vaarasudu Movie: విజయ్ 'వారసుడు' మూవీ అప్ డేట్స్

Vaarasudu Movie: విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న సినిమా వారసుడు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా స్టిల్స్ రిలీజ్ చేశారు.

Vaarasudu Movie: విజయ్ వారసుడు మూవీ అప్ డేట్స్
X

Vaarasudu Movie: దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారసుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి.

వారసుడులో విజయ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.

2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని విడుదల చేస్తున్నట్లు దీపావళి నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.

పూర్తిస్థాయి ఎంటర్‌ టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.








First Published:  28 Oct 2022 3:37 AM GMT
Next Story