Telugu Global
Cinema & Entertainment

Vaarasudu: విజయ్ సినిమాకు క్లీన్ 'యు'

Vijay's Vaarasudu: విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Vaarasudu: విజయ్ సినిమాకు క్లీన్ యు
X

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, క్లీన్ యు సర్టిఫికేట్.. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని చెప్పడానికి ఇవి చాలు. దీనికితోడు వారసుడు థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తమన్ అందించిన పాటలు కూడా హిట్ అయ్యాయి.


విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.


వారిసు జనవరి 11న విడుదల కానుండగా .. వారసుడు జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా 3 రోజుల గ్యాప్ లో రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదంటోంది యూనిట్.

First Published:  10 Jan 2023 6:02 AM GMT
Next Story