Telugu Global
Cinema & Entertainment

Leo Movie - షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ సినిమా

Vijay's Leo Movie - విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా లియో. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Leo Movie - షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ సినిమా
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'లియో'. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా 'లియో' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్.

7 స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రియా ఆనంద్, సీనియర్ నటుడు అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అక్టోబర్ 19న దసరా కానుకగా లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

తన తాజా సినిమాలతో విజయ్ కు టాలీవుడ్ లో కూడా మార్కెట్ పెరిగింది. అతడి సినిమాల కోసం తెలుగులో కూడా ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు జనం. దీనికితోడు లోకేష్ కనగరాజ్ కు తెలుగు ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో.. లియో సినిమా టాలీవుడ్ లో కూడా హాట్ కేక్ గా మారింది.

First Published:  11 July 2023 3:47 AM GMT
Next Story