Telugu Global
Cinema & Entertainment

Vijay-Trisha Leo Movie: కశ్మీర్ లో విజయ్ సినిమా షూటింగ్

Vijay-Trisha Leo Movie - వారసుడు సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే లియో సినిమా స్టార్ట్ చేశాడు విజయ్. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ వివరాలు బయటకొచ్చాయి.

Vijay-Trisha Leo Movie: కశ్మీర్ లో విజయ్ సినిమా షూటింగ్
X

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ అందర్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ వంటి భారీ తారాగణం అలరించబోతోంది.

తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. విజయ్ కెరీర్ లో 67వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘లియో’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. అలాగే ఈ చిత్రం కశ్మీర్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో విజయ్, త్రిషతో పాటు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

వారసుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్. దీంతో తెలుగు-తమిళ భాషలకు కనెక్ట్ అవుతూ, పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ పై కన్నేశాడు విజయ్.




First Published:  4 Feb 2023 7:55 AM GMT
Next Story