Telugu Global
Cinema & Entertainment

Merry Christmas | సంక్రాంతి బరిలో మరో సినిమా

Merry Christmas - విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మెర్రీ క్రిస్మస్. ఇప్పుడీ మూవీని సంక్రాంతికి షెడ్యూల్ చేశారు.

Merry Christmas | సంక్రాంతి బరిలో మరో సినిమా
X

విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ యొక్క పాన్ ఇండియా చిత్రం వాయిదా పడింది. అయితే బాధపడాల్సిన పని లేదు. ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో చేరింది. ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల జనవరి 12కు వాయిదా వేశారు.

కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా సంక్రాంతి బరిలో చేరడంతో పోటీ మరింత పెరిగింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో సంక్రాంతికి భారీ చిత్రాలు బరిలో నిలిచాయి. ఇప్పుడి విజయ్ సేతుపతి రాకతో పోటీ మరింత తీవ్రమైంది. విడుదల తేదీ ప్రకటనలో భాగంగా విడుదల చేసిన పోస్టర్ లో.. కత్రినా రెస్టారెంట్‌లో కూర్చొని ఉండగా విజయ్ మరో టేబుల్ నుంచి ఆమెను తదేకంగా చూస్తున్నట్లు ఉంది.

మెర్రీ క్రిస్మస్ చిత్రానికి అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు అంత క్రేజ్. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి పెద్ద హిట్ పై కన్నేశాడు.

అతడికి తెలుగు, తమిళ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఫర్జీ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక కత్రినాకైఫ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా టైగర్-3 రిలీజ్ చేసింది. ఇప్పుడు మెర్రీ క్రిస్మస్ తో హిందీతో పాటు, సౌత్ లో పేరు తెచ్చుకోవాలని చూస్తోంది.




First Published:  17 Nov 2023 4:16 PM GMT
Next Story