Telugu Global
Cinema & Entertainment

Vidudala 2 | విజయ్ సేతుపతి నుంచి మరో మూవీ

Vijay Sethupathy Vidudala 2 - మహారాజ తర్వాత విజయ్ సేతుపతి నుంచి మరో మూవీ రెడీ అయింది. దాని పేరు విడుదల-2.

Vidudala 2 | విజయ్ సేతుపతి నుంచి మరో మూవీ
X

మొన్ననే మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు విజయ్ సేతుపతి. థియేట్రికల్ గా ఆ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు.. నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏడాది అత్యథికంగా చూసిన ఇండియన్ సినిమాగా అవతరించింది.

ఇప్పుడీ హీరో తన మలి చిత్రాన్ని రెడీ చేశాడు. దీని పేరు విడుదల 2. దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

“విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన “విడుదల 2” రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

“విడుదల” సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా “విడుదల 2” సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. మహారాజ మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాగా “విడుదల 2″పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం “విడుదల 2” మూవీకి మరో ఆకర్షణ కానుంది.




First Published:  31 Aug 2024 1:58 AM GMT
Next Story