Telugu Global
Cinema & Entertainment

Vijay Sethupathi | మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయ్ సేతుపతి

Vijay Sethupathi - ఈ ఏడాది అప్పుడే రెండో సినిమా రెడీ చేశాడు విజయ్ సేతుపతి. అతడి కొత్త సినిమా పేరు ఏసీఈ.

Vijay Sethupathi | మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయ్ సేతుపతి
X

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ను సెవెన్ సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్, డైస్ వేస్తూ కనిపించి అందరినీ ఆకర్షించాడు. ఇది సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.

జూదం, తుపాకులు, పేలుళ్లు, దోపిడీ, బైక్ ఛేజింగ్ వంటి అంశాలు ఇందులో అలరించాయి. టీజర్‌లో యోగి బాబు కామిక్ రియాక్షన్ హ్యుమర్ రేకెత్తిస్తుంది. ఇదొక హిలేరియస్ క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని అర్థమౌతోంది.

ఈ విజువల్ గ్లింప్స్, టైటిల్ ప్రివ్యూ, జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాపై అంచనాల్ని పెంచాయి. త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతికి ‘ఏసీఈ’ ఈ ఏడాది రెండో సినిమా.

First Published:  18 May 2024 8:43 AM GMT
Next Story