Telugu Global
Cinema & Entertainment

Kushi Movie - విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్ ఇదే

Vijay Deverakonda - దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి మరో సినిమా రాబోతోంది. ఖుషి సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది.

Kushi Movie - విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్ ఇదే
X

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు.

నిన్ను కోరి, మజిలీ వంటి సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తనదైన మ్యాజిక్ చేయబోతున్నాడు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించారు. ఖుషీతో ఈ ఇద్దరూ జంటగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.

ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చేసి, అనివార్య కారణాల వల్ల ఆపేశాడు.

ఇప్పుడీ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నాడు.

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ గా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ లో తెరకెక్కుతోన్న ఖుషీ చిత్ర రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.

కశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ - సమంత కాంబినేషన్ ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు.

First Published:  24 March 2023 8:24 AM GMT
Next Story