Telugu Global
Cinema & Entertainment

Family Star | ఫ్యామిలీ స్టార్ టీజర్ ఎలా ఉందంటే..!

Family Star - విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.

Family Star | ఫ్యామిలీ స్టార్ టీజర్ ఎలా ఉందంటే..!
X

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా టీజర్ రిలీజైంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించాడు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

ఇవాళ "ఫ్యామిలీ స్టార్" టీజర్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో..' సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్ కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ లో చూపించారు.

దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ 'నేను కాలేజ్ కు వెళ్లాలి. కొంచెం దించేస్తారా..' అని అడిగితే..'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..' అంటాడు హీరో.

ఇలా ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సమ్మర్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా "ఫ్యామిలీ స్టార్" సినిమా రాబోతోంది.

First Published:  4 March 2024 5:04 PM GMT
Next Story