Telugu Global
Cinema & Entertainment

Family Star | పని పూర్తిచేసిన ఫ్యామిలీ స్టార్

Family Star - అన్నీ అనుకున్న ప్రకారం జరుగుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ మూవీ అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరిన్ని వివరాలు మీకోసం...

Family Star | పని పూర్తిచేసిన ఫ్యామిలీ స్టార్
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. మూవీ టీమ్ గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ అని చెబుతూ మేకర్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మృణాల్, విజయ్, పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ ఒకరినొకరు అభిమానంతో ఆలింగనం చేసుకున్నట్టు చూపించారు.

విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్నాడు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సమ్మర్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇదే. గోపీసుందర్ సంగీత దర్శకుడు.

First Published:  17 March 2024 8:43 AM GMT
Next Story