Telugu Global
Cinema & Entertainment

Family Star | ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్

Family Star - విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజైంది. ఇది పెళ్లి పాట.

Family Star | ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా..' రిలీజైంది. పెళ్లి వేడుక సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా...మంగ్లి, కార్తీక్ పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశాడు.

ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి వీళ్లిద్దరి కెమిస్ట్రీనే కీలకం. అలాంటి కీలకమైన ఎలిమెంట్ ఈ సినిమాలో బాగా పండినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ లో ఆ కెమిస్ట్రీ కనిపించింది. ఇప్పుడు సాంగ్ లో కూడా ఇద్దరూ అదరగొట్టారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకుడు. సర్కారువారి పాట తర్వాత పరశురామ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.

"ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

First Published:  12 March 2024 5:35 PM GMT
Next Story