Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda | షూటింగ్ కు రెడీ అవుతున్న పరశురామ్ సినిమా

Vijay Deverakonda - గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ప్రాజెక్టు అతి త్వరలో సెట్స్ పైకి రాబోతోంది.

Vijay Deverakonda | షూటింగ్ కు రెడీ అవుతున్న పరశురామ్ సినిమా
X

విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈమధ్యే ప్రారంభించారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ నటించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ అమెరికాలో దిగిన ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేశారు.

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో రాబోతోంది ఈ సినిమా.

గతంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో గీతగోవిందం సినిమా వచ్చింది. వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత విజయ్-పరశురామ్ కలిసి చేస్తున్న సినిమా ఇదే.

First Published:  10 July 2023 1:45 AM GMT
Next Story