Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda: కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.

Vijay Deverakonda in a crazy Hindi remake!
X

Vijay Deverakonda in a crazy Hindi remake!

లైగర్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా దెబ్బతో పూరి జగన్నాధ్ తో కలిసి చేయాల్సిన జనగణమన అనే ప్రాజెక్ట్ ను కూడా రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఖుషి అనే సినిమా మాత్రమే ఉంది. సమంతకు ఒంట్లో బాగోలేకపోవడంతో, ఆ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరగడం లేదు.


ఇలాంటి టైమ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పేందుకు.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. గుర్తుతెలియని గూఢచారి’ అంటూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర బృందం.


దీన్ని షేర్ చేసిన విజయ్.. ఇది తన తదుపరి చిత్రం అని ప్రకటించాడు. ఈ కథ విన్నప్పుడు తన గుండె ఇంకాస్త ఎక్కువగా కొట్టుకుందని తెలిపిన దేవరకొండ.. త్వరలోనే షూట్ ఉంటుందని తెలిపాడు.


నిజానికి ఈ సినిమా విజయ్ దేవరకొండ చేయాల్సిన ప్రాజెక్టు కాదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఇది. చరణ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, ఆ కథకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ప్రాజెక్టు సెట్ అయింది.

First Published:  14 Jan 2023 10:53 AM GMT
Next Story