Telugu Global
Cinema & Entertainment

Vijay deverakonda - రౌడీ బాయ్స్ తో హాలిడే ట్రిప్

Vijay Deverakonda Manali trip - అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఎంపిక చేసిన వంద మందిని మనాలీ ట్రిప్ కు తీసుకెళ్లాడు.

Vijay deverakonda - రౌడీ బాయ్స్ తో హాలిడే ట్రిప్
X

ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు.

తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పాడు విజయ్ దేవరకొండ.

అలాంటి సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతో, ఎంపిక చేసిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లాడు. వాళ్లతో పాటు తన తల్లితండ్రులను కూడా తీసుకెళ్లాడు. అందరితో కొంత సమయం గడిపాడు.

Advertisement

తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన వీడియోను విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. వంద మంది తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ పై తమ ప్రేమను చాటుకున్నారు. చివర్లో అందరూ ఎమోషనల్ అయి విజయ్ ని హగ్ చేసుకోవడం వీడియోలో చూడచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.



Next Story