Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda - కొత్త సినిమా లాంఛ్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda - గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన పరశురామ్ తో మరో సినిమా లాంఛ్ చేశాడు విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda - కొత్త సినిమా లాంఛ్ చేసిన విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి సినిమా చేయబోతున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీతగోవిందం, సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన పరశురామ్, డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరినీ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మొదటిసారి వారితో చేతులు కలిపారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించబోతున్నాడు.

First Published:  14 Jun 2023 4:39 PM GMT
Next Story