Telugu Global
Cinema & Entertainment

ఫలించిన రౌడీ స్టార్ వెయిటింగ్

మార్చి ఒకటో తేదీ నుంచి ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో విజయ్- సమంత కాంబినేషన్లో కొన్ని సీన్లను తెరకెక్కించనున్నారు.

ఫలించిన రౌడీ స్టార్ వెయిటింగ్
X

గత ఏడాది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలి నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత విజయ్ గేర్ మార్చి తన మార్క్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఖుషి సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ కాగా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత అనారోగ్యం కారణంగా సమంత ఈ మూవీ షూటింగ్ కు హాజరు కాలేకపోయింది.

ఖుషిని వేగంగా పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన విజయ్ కి ఇది నిరాశ మిగిల్చింది. సమంత షూటింగ్ కి హాజరు కాకపోవడంతో ఆరు నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరగడం లేదు. తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ కొంతకాలంగా సమంత కోసం వెయిట్ చేస్తున్నాడు.

అయితే విజయ్ వెయిటింగ్ ఇప్పుడు ఫలించింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత తిరిగి షూటింగులకు హాజరవుతోంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సీరిస్ షూటింగ్ కి సమంత హాజరైంది. త్వరలో ఖుషి సినిమా సెట్స్ పైకి ఆమె రాబోతోంది.

మార్చి ఒకటో తేదీ నుంచి ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో విజయ్- సమంత కాంబినేషన్లో కొన్ని సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ చాలా డిలే కావాడంతో కంటిన్యూగా షూటింగ్ జరిపి సినిమాను వేగంగా పూర్తి చేయాలని ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. హిమాలయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

First Published:  20 Feb 2023 6:40 AM GMT
Next Story