Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda | 2 భాగాలుగా విజయ్ సినిమా

Vijay Deverakonda - త్వరలోనే గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా 2 భాగాలుగా రానుంది.

Vijay Deverakonda | 2 భాగాలుగా విజయ్ సినిమా
X

రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. విజయ్ దేవరకొండ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇదో కొత్త అనుభవం కాగా, ఈ న్యూస్ తో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటో చూద్దాం..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈసారి చాలా పెద్ద కథ రాసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఆ కథను రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాదంట. ఎలా చూసుకున్నా, ట్విస్టులన్నీ కలిపితే దాదాపు 6 గంటలకు పైగానే వస్తోందట. దీంతో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అన్నట్టు ఈ సినిమాతో విజయ్-రష్మిక మరోసారి కలిశారు. గీతగోవిందం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఇదే. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు విజయ్. ఆ మూవీ కొలిక్కి వచ్చిన వెంటనే గౌతమ్ తిన్ననూరి సినిమా స్టార్ట్ అవుతుంది.

First Published:  1 Oct 2023 3:31 PM GMT
Next Story