Telugu Global
Cinema & Entertainment

అభిషేక్ పిక్చర్స్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి

ఒక సారి విజయ్‌తో సినిమా చేయాలని మమ్మల్ని సంప్రదించాడు. ఆయన ప్రవర్తన చూసిన తర్వాత మేము కలిసి పని చేయాలని భావించలేదు. అప్పటి నుంచి ఇలా ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు.

అభిషేక్ పిక్చర్స్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి
X

'ఖుషీ' సినిమా ఇచ్చిన విజయంతో చాలా హ్యాపీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. దాదాపు 4 ఏళ్ల తర్వాత సక్సెస్ చూడటంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు తోడుగా ఉన్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. తన రెమ్యునరేషన్ నుంచి రూ.1 కోటిని అభిమానులకు పంచిపెడతానని వాగ్దానం చేశాడు. 100 మందికి రూ.1 లక్ష చొప్పున త్వరలోనే అందిస్తానని హామీ ఇచ్చారు.

కాగా, ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఒక ట్వీట్ చేసింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను పంపిణీ చేసి తాము కూడా నష్టపోయామని.. మాకు కూడా న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా విజయ్‌ను కోరారు. దీనిపై విజయ్ తండ్రి గోవర్ధన్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఒక సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే విజయ్ ఎందుకు పరిహారం చెల్లించాలని గోవర్ధన్ రావు ప్రశ్నించారు.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పరాజయం తర్వాత నిర్మాత కేఎస్ రామారావుకు విజయ్ 50 శాతం రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడు. అలాగే నిర్మాత ఇస్తానన్న ఫ్లాట్ కూడా తిరస్కరించాడని చెప్పారు. ఇక ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సినిమా వసూళ్ల విషయంలో అభిషేక్‌కు, నిర్మాతకు మధ్య వివాదం ఉంది. అప్పటి నుంచి విజయ్‌ను టార్గెట్ చేస్తున్నారని గోవర్ధన్ చెప్పారు.

విజయ్‌ను అభిషేక్ నామా చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఒక సారి విజయ్‌తో సినిమా చేయాలని మమ్మల్ని సంప్రదించాడు. ఆయన ప్రవర్తన చూసిన తర్వాత మేము కలిసి పని చేయాలని భావించలేదు. అప్పటి నుంచి ఇలా ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. నిజంగానే మేము డబ్బులు ఇవ్వాల్సి ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతే కానీ ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి.. బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఏమీ జరగదు అని మండిపడ్డారు.

First Published:  9 Sep 2023 2:42 PM GMT
Next Story