Telugu Global
Cinema & Entertainment

Jilebi - జిలేబీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Jilebi Movie Trailer - లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ భాస్కర్ ఓ సినిమా సిద్ధం చేశారు. మూవీ పేరు జిలేబీ. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

Jilebi - జిలేబీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మాతగా మారి తీస్తున్న సినిమా ఇది. ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ సినిమాని అంజు అశ్రాని సమర్పిస్తున్నారు.

విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ఓ మోస్తరుగా క్లిక్ అయింది. పాటలు కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ థ్రిల్ రైడ్ ని అందించింది. ట్రయిలర్ చూస్తుంటే, ఏదో సీరియస్ అంశాన్ని దాచిపెట్టినట్టు అనిపిస్తోంది.

దర్శకుడు విజయ్ భాస్కర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫన్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ట్రైలర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ పాత్రలు వినోదాత్మకంగా ఉన్నాయి. చివర్లో హారర్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచాయి. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్, థ్రిల్ మరింత ఎలివేట్ చేసింది.

ఆగస్టు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ భాస్కర్ డైరక్ట్ చేసిన సినిమా కావడం, పైగా తన కొడుకునే హీరోగా పరిచయం చేయడంతో జిలేబీ మూవీపై అందరి దృష్టిపడింది.

First Published:  12 Aug 2023 3:30 AM GMT
Next Story