Telugu Global
Cinema & Entertainment

Vijay Trisha: విజయ్ సరసన మరోసారి త్రిష

Vijay and Trisha - 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయ్, త్రిష కలిసి ఓ సినిమా చేస్తున్నారు

Vijay Trisha: విజయ్ సరసన మరోసారి త్రిష
X

కోలీవుడ్ స్టార్ విజయ్ కొత్త సినిమాను, స్టార్ డైరక్టర్ లోకేషన్ కనగరాజ్ డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 7-స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతోంది ఈ సినిమా. ఇప్పుడీ ప్రాజెక్టులోకి త్రిషను తీసుకున్నారు.

విజయ్ కెరీర్ లో 67వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టులోకి త్రిషను తీసుకున్నారు. విజయ్‌తో త్రిషకు ఇది ఐదో సినిమా. 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇలా విజయ్-త్రిష కలిసి సినిమా చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సినిమాలో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా ప్రియా ఆనంద్ కనిపించనుంది. వీళ్లతో పాటు అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్.. కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్రిష ఎంపికతో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ సెలక్షన్ పూర్తయినట్టయింది. షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు.


First Published:  1 Feb 2023 1:54 PM GMT
Next Story