Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam - శాకుంతలం సినిమా నుంచి వీడియో సాంగ్

Shaakuntalam - శాకుంతలం సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజైంది. వీడియో సాంగ్ చూడ్డానికి చాలా బాగుంది.

Shaakuntalam - శాకుంతలం సినిమా నుంచి వీడియో సాంగ్
X

''శాకుంతలం సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌గారితో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా. ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నాం'' అని అన్నారు శాకుంతలంలో శకుంతలంగా నటించిన సమంత.

సమంత టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. గుణ టీమ్‌ వర్క్స్ నిర్మించింది. ఈ ఏప్రిల్‌ 14న విడుదల కానుంది శాకుంతలం. నీలిమ గుణ నిర్మాత. గుణశేఖర్‌ రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని "మల్లికా మల్లికా మాలతీ మాలికా" అనే పాట వీడియోను రిలీజ్ చేశారు.

చైతన్య ప్రసాద్‌ అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది. మణిశర్మ కూర్చిన బాణీకి అందంగా న్యాయం చేశారు సింగర్‌ రమ్య బెహరా. పాట వింటున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపించిందో, స్క్రీన్‌ మీద చూసినప్పుడు అంతే ఇంపుగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లిక మల్లిక పాట విజువల్‌ ఫీస్ట్ లా అనిపించింది.

విడుదలకు ముందే ఇలా వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. ఇప్పటికే కొన్ని సినిమాల వీడియోల్ని ఇలా విడుదల చేశారు. శాకుంతలం యూనిట్ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతోంది.



First Published:  1 April 2023 5:32 PM GMT
Next Story