Telugu Global
Cinema & Entertainment

రూట్ మార్చిన వెంకటేష్ .. వరుసగా ప్రత్యేక పాత్రలు

మూడో పార్ట్ గా హిట్ -3 రాబోతోంది. ఇందులో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర క్లైమాక్స్ లో వెంకటేష్ ఓ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది

రూట్ మార్చిన వెంకటేష్ .. వరుసగా ప్రత్యేక పాత్రలు
X

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అత్యధిక విజయాల శాతం ఉన్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలతో పోలిస్తే ముందు నుంచి వెంకీ తన ఏజ్ కు తగ్గట్లు పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. సోలో హీరోగా సినిమాలు తగ్గించి పదేళ్ల నుంచే మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి మొన్నిమధ్య విడుదలైన ఎఫ్ -3 మూవీ వరకు చాలా సినిమాల్లో మరో హీరోతో కలిసి తెరపంచుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వెంకటేష్ మరో రూట్ ఎంచుకున్నాడు. యువ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నాడు.

ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా రాగా అందులో ఒక చిన్న పాత్రలో వెంకటేష్ నటించాడు. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో వెంకటేష్ ఓ రోల్ చేస్తున్నాడు. దీనిని సల్మాన్ ఖాన్ కూడా ధ్రువీకరించాడు.

హిట్ మూవీ సీరిస్ లో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను వరుసగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్, హిట్ -2 ఫ్రాంచైజీలు వచ్చాయి. ఇక ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా హిట్ -3 రాబోతోంది. ఇందులో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర క్లైమాక్స్ లో వెంకటేష్ ఓ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే శైలేష్ వెంకీని కలిసి కథ చెప్పారని.. అందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇలా వరుసగా పలు సినిమాల్లో వెంకటేష్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నాడు. అలాగే అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న వెబ్ సీరిస్ రానానాయుడులో దగ్గుబాటి రానాతో కలిసి వెంకటేష్ నటిస్తున్నాడు.

First Published:  26 Dec 2022 5:10 AM GMT
Next Story